
ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరింత ఫోకస్ చేశారు విక్టరీ వెంకటేశ్. ఈ క్రమంలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేశ్ ఓ సినిమా చేయనున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుంతుందని సమాచారం. అయితే తాజాగా ఈ సినిమా కోసం ఓ హీరోయిన్ ఎంపిక చేశారట.

ప్రస్తుతం ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తుండగా.. అందులో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ను ఎంపిక చేసినట్లు టాక్. త్వరలోనే ఈ సినిమాను మొదలుపెట్టి వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. ఇప్పటివరకు ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. కేవలం ఇస్మార్ట్ శంకర్ సినిమా మాత్రమే హిట్టయ్యింది. కానీ ఇప్పటివరకు ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తుంది. ఇందులో యువరాణి పాత్రలో కనిపించనుంది. ఇప్పుడు ఈ అమ్మడు ఆశలన్నీ ఈ సినిమా పైనే ఉన్నాయి. అలాగే ప్రభాస్ జోడిగా రాజా సాబ్ చిత్రంలోనూ ఈ అమ్మడు నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ రెండు సినిమాలు విడుదల కాకముందే ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం హరి హర వీరమల్లు, రాజా సాబ్ చిత్రాలతో బిజీగా ఉన్న నిధికి.. ఇప్పుడు వెంకీ సినిమాలో మరో ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది.