
'కింగ్ ఆఫ్ కోత' తన కెరీర్‌లో బిగ్గెస్ట్ సినిమా అని అన్నారు హీరో దుల్కర్ సల్మాన్. పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పారు. దుల్కర్ సల్మాన్‌ని యాక్షన్ డ్రామాలో చూడటం చాలా ఎక్సయిటింగ్‌గా ఉందని అన్నారు రానా దగ్గుబాటి. 'కింగ్ ఆఫ్ కోతా'తో దుల్కర్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లాలని ఆకాంక్షించారు హీరో నాని. 'కింగ్ ఆఫ్ కోత' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వీరందరూ మాట్లాడారు.

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'డబుల్ ఇస్మార్ట్'. ఈ సినిమా రెండో షెడ్యూల్ థాయ్‌ల్యాండ్‌లో మొదలైంది. హీరో రామ్, సంజయ్ దత్ మీద కీ రోల్స్ చిత్రీకరిస్తారు. ఇటీవల ముంబైలో ఒక ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. ఈ సినిమాను పూరి కనెక్స్ట్ బ్యానర్ మీద పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు

లోకేష్ కనగరాజ్ డైరక్షన్‌లో రెండు సినిమాలు చేయనున్నట్టు ప్రకటించారు హీరో సూర్య. ఫ్యాన్స్ మీట్‌లో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని డిక్లేర్ చేశారు. రోలెక్స్ కేరక్టర్ హీరోగా... లోకేష్ చెప్పిన కథ నచ్చిందన్నారు. ఇప్పుడున్న ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత లోకేష్ డైరక్షన్‌లోనే 'ఇరుంబుకై మాయావి' అనే సూపర్ హీరో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు.

ఈ ప్రపంచం కోసం జీవించాల్సిన అవసరం లేదని అంటున్నారు సమంత. 'మీ గౌరవాన్ని మీరు తెలుసుకోండి. మీ స్థాయిని మీరే పెంచుకోండి. మీ కోసం మీరు జీవించండి' అని చెప్పారు. 'సైలెంట్‌గా ఉన్నవారిని సమాజం గుర్తించకపోవచ్చని చెప్పారు. అయినా పట్టించుకోవద్దని సలహా ఇచ్చారు సామ్

తమన్నా నటించిన లేటెస్ట్ వెబ్ సీరీస్ 'ఆఖరి సచ్'. ఈ వెబ్ సీరీస్ కథ విన్నప్పుడు షాక్ తిన్నట్టు చెప్పారు తమన్నా. ఇందులో అన్య అనే ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించినట్టు తెలిపారు. ఈ సీరీస్ తన కెరీర్‌లో చాలా స్పెషల్ అని అన్నారు. పోలీస్ ఆఫీసర్‌గా నటించడం ఇదే తొలిసారి అని చెప్పారు. ఈ నెల 25న విడుదల కానుంది 'ఆఖరి సచ్'.