
రష్మిక, సమంత, పూజా హెగ్డే టైమ్ అయిపోయిందా..? ఇకపై వాళ్లను వరస సినిమాల్లో చూడటం కష్టమేనా..? ప్రస్తుతానికి శ్రీలీల, మృణాళ్ ఠాకూర్ లీడింగ్‌లో ఉన్నారు.. వీళ్ల వెనక మరో ఇద్దరు ముగ్గురు ముద్దుగుమ్మలు కూడా మేమున్నాం అంటూ ఫాలో అవుతున్నారు. శ్రీలీల వదిలేసిన ఆఫర్స్ కూడా వాళ్లకే వచ్చేస్తున్నాయి. మరి టాలీవుడ్ నెక్ట్స్ స్టార్ హీరోయిన్స్ ఎవరు..? ఆ లిస్టులో ముందున్న భామలెవరు..?

స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి..? ఏం చేసినా దానికోసమే కదా..? టాలీవుడ్‌లో ఈ స్టార్ స్టేటస్ కోసమే యుద్ధం జరుగుతుంది. ఆల్రెడీ ఆ హోదాలో ఉన్న రష్మిక, పూజా హెగ్డే, సమంత లాంటి వాళ్లు కాస్త స్లో అవ్వడంతో.. ఆ తర్వాత జనరేషన్ రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం శ్రీలీల, మృణాళ్ ఠాకూర్ టైమ్ నడుస్తుంది.. ఏ సినిమాలో చూసినా వాళ్లే కనిపిస్తున్నారు.

శ్రీలీల, మృణాళ్ తర్వాత నేహా శెట్టి, సాక్షి వైద్య లాంటి వాళ్లు రేసులోకి వచ్చారు. నెక్ట్స్ మేమే అంటూ హింట్స్ ఇస్తున్నారు. పూరీ జగన్నాథ్ మెహబూబా సినిమాతో పరిచయమైన నేహా.. డిజే టిల్లుతో గుర్తింపు తెచ్చుకున్నారు.

మొన్న కార్తికేయ బెదురులంక 2012తో హిట్ కొట్టారు కూడా. ఇప్పుడు కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్, విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల్లో నేహా శెట్టే హీరోయిన్.

సాక్షి వైద్యకు ఏజెంట్, గాండీవధారి అర్జున ఫ్లాపైనా ఆ ఎఫెక్ట్ కెరీర్‌పై పడట్లేదు. ప్రస్తుతం పవన్ ఉస్తాద్ సహా.. సాయి ధరమ్ తేజ్, రవితేజ, శర్వానంద్, దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలతో నటిస్తున్నారు.

మీడియం రేంజ్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారిపోయారు సాక్షి వైద్య. మొత్తానికి స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఈ యంగ్ బ్యూటీస్ సిద్ధంగా ఉన్నారు. జస్ట్ టైమ్ కోసం వేచి చూస్తున్నారంతే.