Sekhar Master: శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీపై విమర్శలు.. క్రియేటివిటీ ఎక్కువైందంటూ కామెంట్స్

Edited By: Phani CH

Updated on: Mar 13, 2025 | 6:00 PM

ఒక్కోసారి క్రియేటివిటీ ఎక్కువైనా సమస్యే..! మన క్రియేటివిటీ అవతలి వాళ్లకు ఎలా వెళ్తుందో తెలియదు కదా..! శేఖర్ మాస్టర్ విషయంలో ఇదే జరుగుతుందిప్పుడు. హుక్ స్టెప్స్ పేరుతో మనోడు కాస్త శృతి మించుతున్నాడు అంటూ ఈయనపై చర్చ జరుగుతుందిప్పుడు. ఎందుకో తెలియాలంటే.. ఇదిగో ఈ స్టోరీ.. అందులో డాన్సులు చూస్తే మీకే క్లారిటీ వస్తుంది.

1 / 5
టాలీవుడ్‌లో నెంబర్ వన్ కొరియోగ్రఫర్ ఎవరంటే మరో అనుమానం లేకుండా చెప్పే మాట శేఖర్ మాస్టర్..! చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అంతా ఈయనే కావాలనుకుంటారు. శేఖర్ స్టెప్ అంటే బ్రాండ్ అంతే.

2 / 5
కానీ ఈ బ్రాండ్ ఈ మధ్య కాస్త గతి తప్పి.. స్టెప్పులు శృతి మించుతున్నాయేమో అనిపిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్లతో వేయించే స్టెప్పులే వివాదాస్పదమవుతున్నాయి.హీరోలు ఎలాంటి స్టెప్స్ వేసినా చూడ్డానికి ఓకే.. కానీ అమ్మాయిలతో అలా కాదు.

3 / 5
వాళ్లతో స్టెప్పులేయించేటప్పుడే కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ శేఖర్ మాస్టర్‌కు వార్నింగులు వస్తున్నాయి. ఆ మధ్య మిస్టర్ బచ్చన్‌లో హీరోయిన్ బ్యాక్ పాకెట్‌లో హీరోతో చేయి పెట్టించే స్టెప్‌పై దర్శకుడు హరీష్ శంకర్ సారీ చెప్పారు. ఆ తర్వాత పుష్ప 2లోని పీలింగ్స్ స్టెప్స్‌పై అభ్యంతరాలొచ్చాయి.

4 / 5
మొన్నటికి మొన్న డాకూ మహారాజ్‌లో దబిడి దిబిడి స్టెప్స్ బాగా ట్రోల్ అయ్యాయి. బాలయ్య డై హార్డ్ ఫ్యాన్స్ సైతం ఏంటీ స్టెప్పులు అంటూ కాస్త నిట్టూర్చారు. ఇవన్నీ ఒకెత్తు అయితే.. తాజాగా రాబిన్ హుడ్‌లో కేతిక శర్మ కోసం శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు బాగా చర్చనీయాంశం అవుతున్నాయి.

5 / 5
పాట మొత్తంలో వచ్చే స్టెప్స్ కంటే.. ఒక్క హుక్ స్టెప్ మాత్రమే అందరికీ గుర్తుండిపోతుంది. అది మరింత గుర్తుండాలని.. కాస్త హద్దు మీరుతున్నారు శేఖర్ మాస్టర్. మిగిలిన పాట అంతా ఎలా ఉన్నా.. రాబిన్ హుడ్ హుక్ స్టెప్‌లో డోస్ ఎక్కువైందని అర్థమవుతుంది. మరి ఇకపై అయినా.. ఈ కామెంట్స్ మాస్టర్ దృష్టిలో పెట్టుకుంటారేమో చూడాలి.