Anil kumar poka | Edited By: Janardhan Veluru
Nov 21, 2022 | 4:50 PM
సౌత్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న రష్మిక ఇప్పుడు బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ బ్యూటీ నార్త్ ఎంట్రీ తొలి అడుగులే తడబడుతున్నాయి. తాజాగా రష్మిక హిందీతో సైన్ చేసిన తొలి సినిమా రిలీజ్ ఎనౌన్స్‌మెంట్..
ఆడియన్స్‌తో పాటు రష్మికకు కూడా షాక్ ఇచ్చింది.షార్ట్ టైమ్‌లోనే సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకున్న రష్మిక, బాలీవుడ్ ఎంట్రీ మాత్రం అనుకున్నంత హ్యాపీగా లేదు. రీసెంట్‌గా రష్మిక నటించిన హిందీ మూవీ గుడ్‌బై ఆడియన్స్ ముందుకు వచ్చింది.
అమితాబ్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేదు.గుడ్‌బై కన్నా ముందే బాలీవుడ్‌లో మిషన్ మజ్ను సినిమాను స్టార్ట్ చేశారు రష్మిక మందన్న.
సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు నేషనల్ క్రష్. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కావటంతో నటిగానూ ప్రూవ్ చేసుకునే ఛాన్స్ దక్కిందని హ్యాపీగా ఫీల్ అయ్యారు.
మిషన్ మజ్ను మేకర్స్ రష్మికకు షాక్ ఇచ్చారు. ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ బాలీవుడ్ సిచ్యుయేషన్ అంత ఆశాజనకంగా లేకపోవటంతో డిజిటల్ రిలీజే సేఫ్ అని ఫీల్ అవుతున్నారు.
ఈ డెసిషన్ రష్మిక కెరీర్ మీద గట్టిగానే ఎఫెక్ట్ అవుతోంది.బాలీవుడ్‌లో బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రష్మిక తొలి సక్సెస్ కొసం మరికొంత కాలం వెయిట్ చేయక తప్పని పరిస్థితి.
ప్రజెంట్ నార్త్‌లో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న యానియల్ సినిమాలో నటిస్తున్నారు రష్మిక. ఈ సినిమా సక్సెస్ అయితేనే హిందీలో ఈ బ్యూటీ కెరీర్ ఊపందుకుంటుంది. మరి 2023లో అయినా ఆమె కల నెరవేరుతుందా..? అందని ద్రాక్ష చేతికి అందుతుందా?
రష్మిక నార్త్ సిల్వర్ స్క్రీన్ మీద కూడా ఆ ఫామ్ చూపిస్తారా? లేదా అన్నది వేచి చూడాల్సిందే..