
Nara Rohit: నారా రోహిత్ హీరోగా నటిస్తున్న 20వ సినిమాకు సుందరకాండ అనే పేరు పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. సెప్టెంబర్ 6న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. ప్రతి వ్యక్తికి రిలేట్ అయ్యేలా కథ ఉంటుందని చెప్పారు. అన్ని రకాల ఎమోషన్స్ ని చూపించామని, తప్పక నచ్చుతుందని అన్నారు మేకర్స్

Nithiin: నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా రాబిన్ హుడ్. నితిన్ గెటప్ నుంచి కేరక్టరైజేషన్ వరకు ప్రతిదీ డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మైత్రీ మూవీ మేకర్స్. క్రిస్మస్ సెలవులు, న్యూ ఇయర్ సెలవులు తమ సినిమాకు కలిసి వస్తాయని అన్నారు.

Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఓ సినిమాకు సంతకం చేశారు. సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అబ్బురపరిచే కథతో సాంకేతికంగా అద్భుతమైన టీం తో కలిసి సరిహద్దులను పుష్ చేయబోతున్నట్టు ప్రకటించారు నిర్మాత సాహు గారపాటి.

Teacher: కలర్స్ స్వాతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా టీచర్. తెలంగాణలోని ఓ మారుమూల పల్లెకు చెందిన ముగ్గురు అల్లరి కుర్రాళ్ల జీవితం ఓ టీచర్ పరిచయంతో ఎలా మారిందనే ఆసక్తికరమైన కథతో తెరకెక్కుతోంది. 90స్ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ ఆదిత్య హసన్ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ మేడారం నిర్మిస్తున్నారు.

Osey Arundhati: మోనికా చౌహాన్, కమల్ కామరాజు, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ఒసేయ్ అరుంధతి. ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. లేటెస్ట్ గా విడుదలైన పాటకు నెట్టింట్లో మంచి స్పందన వస్తోంది. కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమా అని అన్నారు మేకర్స్.