కొన్నేళ్లుగా అప్‌కమింగ్ హీరోయిన్లతోనే నటిస్తున్నారు బాలయ్య. చాలాకాలం తర్వాత భగవంత్ కేసరిలో కాజల్ లాంటి స్టార్ హీరోయిన్‌తో జోడీ కట్టారు. అయితే అగ్ర దర్శకులతో పని చేస్తున్నపుడు.. హీరోయిన్ల రేంజ్ కూడా అలాగే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే బాబీ సినిమా కోసం ముద్దుగుమ్మల వేట మొదలైంది. పైగా ఇందులో నలుగురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తుంది.
బాబీ సినిమా మాఫియా నేపథ్యంలో నడుస్తుందని తెలుస్తుంది. ఇందులోనూ రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు బాలయ్య. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం ఓ సీనియర్ హీరోయిన్ కావాలి.
దానికోసం త్రిష, ప్రియమణిలలో ఒకర్ని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. త్రిష భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుండటంతో.. ప్రియమణికి ఓటేసేలా కనిపిస్తున్నారు దర్శక నిర్మాతలు.
చిరంజీవి సినిమాకు కూడా భారీగానే తీసుకుంటున్నారు త్రిష. వీళ్లు కాకుండా బాలయ్య సినిమాలో మరో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో ఊర్వశి రౌతెలా ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యారు.
కేవలం స్పెషల్ సాంగ్ కాకుండా కీలక పాత్రలోనూ నటిస్తున్నారీమె. ఇక యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి సైతం ఓ కీ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి బాలయ్య సినిమాలో హీరోయిన్ కన్ఫ్యూజన్ చాలానే ఉందిప్పుడు.