
బాలయ్య స్పీడ్ చూస్తుంటే కుర్ర హీరోలకు కూడా కుళ్లు వచ్చేస్తుంది. అసలు అదేం స్పీడ్ అండీ బాబూ.. ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు ఒప్పుకున్న సినిమాలను కూడా ఎడాపెడా పూర్తి చేస్తున్నారు.

ఆ మూడు నెలల బాకీ కూడా కలిపి తీర్చేస్తున్నారు. స్పీడ్ పెంచేసి.. తనతో పాటు దర్శక నిర్మాతలను కూడా పరుగులు పెట్టిస్తున్నారు. మళ్లీ స్పీడ్ పెంచేసారు బాలయ్య.

ఓ వైపు సంక్రాంతికి డాకూ మహరాజ్ అంటూ బాక్సాఫీస్‌పై యుద్ధం ప్రకటించిన బాలయ్య.. ఈలోపే అఖండ 2ను సైతం సిద్ధం చేస్తున్నారు. అసలు ఈ సీక్వెల్‌పై టీం ఇచ్చిన అప్‌డేట్ ఏంటి..? దీని షూటింగ్ డీటైల్స్ ఏంటి..?

తాజాగా అఖండ 2 రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. RFCలో రామ్ లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీలో ఫైట్ సీన్ చిత్రీకరణ మొదలైంది.


