
అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాల వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి 8 గంటల 13 నిమిషాలకు పూర్తి సాంప్రదాయబద్ధంగా పెళ్లి వేడుక నిర్వహించేందుకు ముహూర్తం నిర్ణయించారు.

ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెల్రబేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీ వివాహ వేదికను సిద్ధం చేశారు.

ఈ ఏడాది ఆగస్టు 8న కుటుంబ సభ్యుల సమక్షంలో వీళ్ళ నిశ్చితార్థం జరిగింది. తాజాగా ఘనంగా పెళ్లి జరిగింది.

కొద్ది నెలల్లోనే వారి పరిచయం ప్రేమగా మారింది. తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

300 మంది సెలబ్రిటీలకు ఆహ్వానాలు అందినట్టుగా తెలుస్తోంది. ఓ ఓటీటీ షోలో తొలిసారిగా శోభితను కలుసుకున్నారు నాగచైతన్య. కొద్ది నెలల్లోనే వారి పరిచయం ప్రేమగా మారింది. తరువాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు 8న కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది.