- Telugu News Photo Gallery Cinema photos Mrunal Thakur responds to a fan's marriage proposal on her Instagram post
Mrunal Thakur: పెళ్లి చేసుకుంటానన్న ఫ్యాన్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన మృణాల్
ఆ తర్వాత 2014లో మరాఠీ సినిమా ‘విట్టి దండు’ తో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి.. తన నటనతో అందర్ని ఆకట్టుకుంది. అనంతరం పలు చిత్రాల్లో నటించినా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది.
Updated on: Feb 28, 2023 | 9:36 PM

మహారాష్ట్రలోని ధూలేలో జన్మించిన మృణాల్.. కాలేజీ రోజుల్లోనే బుల్లితెరపై అడుగుపెట్టింది. సీరియల్స్ ద్వార మచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ..

ఆ తర్వాత 2014లో మరాఠీ సినిమా ‘విట్టి దండు’ తో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి.. తన నటనతో అందర్ని ఆకట్టుకుంది. అనంతరం పలు చిత్రాల్లో నటించినా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది.

2018లో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ ‘సూపర్ 30’లో హృతిక్ రోషన్ సరసన నటించి విమర్శకుల ప్రశంసలను అందుకుంది.

ఆ తర్వాత ‘ఘోస్ట్ స్టోరీస్’, ‘ధమాకా’, ‘జెర్సీ’ మూవీస్‌తో ప్రేక్షకులను అలరించింది. 2022లో తెలుగులో విడుదలైన ‘సీతారామం’ మృణాల్ ఠాకూర్ క్రేజ్ ను అమాంతం పెంచేసింది.

తెలుగుతోపాటు.. అన్ని భాషల్లో విడుదలైన ఈ సినిమా మృణాల్ కు దేశవ్యాప్తంగా సూపర్బ్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు ప్రముఖలతోపాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందాయి. కాగా, బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు హిందీలో 5 చిత్రాలు, తెలుగులో నాని సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.

తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది మృణాల్ .. ఈ క్రమంలోనే ఓ అభిమాని మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నా వైపు నుంచి ఓకే అంటూ అతను కామెంట్ పెట్టాడు. దీనికి రిప్లై గా మృణాల్ మాత్రం నా వైపు నుంచి ఓకే కాదుగా అని పెట్టేసింది.




