సీరియల్స్ నుంచి సినిమాలోకి వచ్చింది ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. షాహిద్ కపూర్ హీరోగా నటించిన జెర్సీ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ వయ్యారి భామ.
సీతారామం సినిమాలో మృణాల్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సీత మహాలక్ష్మీ పాత్రల్లో అద్భుతంగా నటించింది మృణాల్.
ఇక ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న హాయ్ నాన్న సినిమాలో నటిస్తుంది మృణాల్.
ఆలాగే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ మ్యాన్ సినిమాలో నటిస్తుంది మృణాల్. తెలుగులో ఈ అమ్మడికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వస్తున్నాయి.