
పండక్కి పర్ఫెక్ట్ మాస్ సినిమా పడితే కలెక్షన్లు ఎలా ఉంటాయో చాలాసార్లు చూసాం.. కానీ ఈ సీజన్‌లో ఎమోషనల్ సినిమాలతో వచ్చి ఏడిపిస్తామంటున్నారు ఇద్దరు హీరోలు. ఓ వైపు రజినీకాంత్ మాస్ సినిమాతో పోటెత్తడానికి సిద్ధంగా ఉన్నా.. విశ్వంతో గోపీచంద్ కమ్ బ్యాక్ కోసం చూస్తున్నా.. వీళ్ళిద్దరి మధ్యలో రెండు మాంచి ఎమోషనల్ సినిమాలు వస్తున్నాయి. మరి అవేంటి..?

ఏ పండక్కైనా కమర్షియల్ సినిమాలకు కాస్త ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది. టాక్ అటూ ఇటూగా ఉన్నా.. పాస్ మార్కులు వేస్తుంటారు ఆడియన్స్. ఇదే సీజన్‌లో ఎమోషనల్ సినిమాలకు మంచి గిరాకీ ఉంటుంది. దసరాకు ఈ క్రేజ్‌నే క్యాష్ చేసుకోడానికి వచ్చేస్తున్నారు సుహాస్ అండ్ సుధీర్ బాబు.

ఈ ఇద్దరూ పండక్కి మంచి ఫ్యామిలీ సినిమాలను పట్టుకొస్తున్నారు.అక్టోబర్ 10న రజినీకాంత్ వేట్టయన్.. 11న గోపీచంద్ విశ్వం వస్తున్నాయి. ఈ రెండూ పక్కా కమర్షియల్ సినిమాలు. వీటి మధ్యలో సుహాస్ జనక అయితే గనక వస్తుంది.

అక్టోబర్ 12న విడుదల కానున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ నీల్ అసిస్టెంట్ సందీప్ రెడ్డి బండ్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జనక అయితే గనకలో ఓ బోల్డ్ పాయింట్ టచ్ చేస్తున్నారు మేకర్స్.

అలాగే మాస్ హీరో సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో అంటూ ఈసారి ఎమోషనల్ టర్న్ తీసుకున్నారు. అభిలాష్ కంకర ఈ సినిమాకు దర్శకుడు. హై ఎమోషనల్ డ్రామాగా వస్తుంది మా నాన్న సూపర్ హీరో. అక్టోబర్ 11న రాబోతుంది ఈ చిత్రం. మరి ఈ పండక్కి వీటి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూడాలి.