
ఎప్పుడూ సోషల్ మీడియాలో కనిపించని వ్యక్తుల పేర్లు ఉన్నట్టుండి ట్రెండింగ్‌లోకి వచ్చేస్తే, అకేషన్ ఏంటా అని అందరూ ఆరా తీస్తారు. ఇప్పుడు అలా అందరూ అనుష్క శెట్టి గురించి మాట్లాడుకుంటున్నారు.

ఆమె సోషల్ మీడియాలో ఫుల్ పార్మ్ లో ఉన్నారు. ఇంతకీ స్వీటీ ట్రెండింగ్‌కి రీజన్ ఏంటి అంటారా.? బాహుబలి 2 విడుదలై ఏడేళ్లయింది. దేవసేన లాంటి పవర్‌ఫుల్ రోల్ సిల్వర్ స్క్రీన్ మీద నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. అనేది ట్రెండింగ్‌కి యుఎస్‌పీ.

స్వీటీ ఫ్యాన్స్ అందరూ దేవసేనను తెగ గుర్తుచేసుకుంటున్నారు. బాహుబలి సీక్వెల్ రిలీజ్‌ని రీకాల్ చేసుకుంటే, ప్రభాస్‌నో, జక్కన్ననో, రానానో గుర్తుచేసుకోవాలిగానీ, స్వీటీనే ఎందుకు తలచుకుంటున్నట్టు అంటూ మరికొందరు ఆశ్చర్యపోతున్నారు.

అనుష్క చేసిన దేవసేన కేరక్టర్‌ని అంత తేలిగ్గా మర్చిపోలేం అన్నది ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్న మాట. ముంబైలో అడుగుపెడితే అందరూ అనుష్క గురించే అడిగేవారని రకుల్ అప్పట్లో చెప్పిన మాటలని..,

దేవసేన లాంటి కేరక్టర్‌ని చేయాలని ఉందని కృతి శెట్టి అన్న మాటలను కూడా పనిలో పనిగా వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. దేవసేన తర్వాత అనుష్క కెరీర్‌లో హిట్ మూవీగా నిలిచింది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.

గతేడాది విడుదలైంది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఆ తర్వాత ఇప్పటిదాకా అనుష్క నెక్స్ట్ మూవీ రిలీజుల గురించి అనౌన్స్ మెంట్లు లేవు. మలయాళంలో కథనార్ చేస్తున్నారు.

కానీ ఆ మూవీ రిలీజ్ ఎప్పుడో ఇంకా తెలియదు. ప్రస్తుతం క్రిష్‌తో చేస్తున్న సినిమా అయినా త్వరగా కంప్లీట్ కావాలని, ఏదోలా ఈ ఇయర్ ఎండింగ్‌లోపు తమని పలకరించేయాలని కలలు కంటున్నారు స్వీటీ సైన్యం.