
'బాలీవుడ్ షాహెన్‌షా' అని పిలువబడే బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్. ఈయనకి కోల్‌కతాలో ఒక ఆలయం ఉంది. భారతీయ సినిమాకు ఆయన చేసిన అద్భుతమైన సేవలకు ప్రతీకగా అభిమానులు ఇక్కడ మందిరం నిర్మించారు.

కోలీవుడ్ స్టార్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి కూడా ఫ్యాన్స్ గుడి కట్టారు. అయితే అది తమిళనాడులో కాదు కర్ణాటకలోని కోలార్‌లోని అయన అభిమానులు ఆయన గౌరవార్థం ఒక ఆలయాన్ని నిర్మించడం జరిగింది.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో సోను సూద్ చేసిన సేవ ఎవ్వరు ఎప్పటికి మర్చిపోలేనిది. అయితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన సిద్దిపేటలోని తాండా గ్రామంలో ఆయన అభిమానులు ఆయన నిస్వార్థ సేవను గౌరవించటానికి ఒక ఆలయాన్ని నిర్మించారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు 36వ పుట్టినరోజున ఆమె ఫ్యాన్స్ తమ ప్రగాఢమైన అభిమానాన్ని ప్రదర్శిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఆలయాన్ని నిర్మించారు. ఇది బాపట్లలో ఉంది. ఇది తన అభిమాని తెనాలి సందీప్ నిర్మించారు.

తమిళనాట అభిమానులచే తన పేరు మీద ఆలయం నిర్మించబడ్డ తొలి భారతీయ నటిగా ఖుష్బూ సుందర్ గుర్తింపు పొందారు. ఇది ప్రేక్షకులపై ఆమె చూపిన గణనీయమైన అభిమానానికి నిదర్శనం.