
కొత్తొక వింత.. పాత ఒక రోత... ఇది పాత సామెతే.. కానీ సందర్భం వచ్చినప్పుడు వాడుతూనే ఉంటాం. ఇది జస్ట్ ఈ ప్రావర్బ్ విషయంలోనే కాదు.. చాలా సందర్భాల్లో జరుగుతూనే ఉంటుంది. అప్పుడప్పుడూ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకుని రీ యూజ్ చేస్తాం. ఇప్పుడు టాలీవుడ్‌లో అలాంటి ఓ ట్రెండ్ మళ్లీ యూసేజ్‌లోకి వచ్చేసింది... దీనికి కీరవాణి కొబ్బరికాయ కొట్టేశారు... మిగిలిన వాళ్ల మాటేంటి?

విన్నారు కదా... అదీ సంగతి..! ఒకప్పుడు ఆడియో వేడుకలంటే, సినిమా రిలీజ్‌కి ముందు అదో పెద్ద పండుగ. ఇప్పుడు సింగిల్స్ రిలీజ్ చేయడం మొదలుపెట్టాక ఆడియో వేడుకలే కనుమరుగయిపోయాయి. అన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్ల కింద కన్వెర్ట్ అయిపోయాయి. అయితే మళ్లీ ఆ కల్చర్‌ని రీ ఇంట్రడ్యూస్ చేశారు లవ్ మీ టీమ్‌తో కలిసి కీరవాణి అండ్ దిల్‌రాజు.

ఏ ఐ టెక్నాలజీని ఉపయోగించి లవ్ మీ కోసం ఓ పాట చేశారు ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి. ఇలాంటి స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు ఆడియో వేడుక జరపకుండా ఎలా ఉంటాం? అన్నది దిల్‌రాజు ఓపెన్‌గా చెప్పిన మాట. ఒకప్పుడు ఆడియో వేడుకలకు ఎంత ఇంపార్టెన్స్ ఉండేదో హీరోయిన్ వైష్ణవి చైతన్య ఎక్స్ పీరియన్స్ షేర్ చేసుకున్నారు. అయినా ఆడియో స్టేజ్‌ల మీద దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ లను అంత తేలిగ్గా మర్చిపోగలరా ఆడియన్స్?

దేవిశ్రీ ప్రసాద్ గురించి మాట్లాడగానే మనకు వెంటనే తమన్ గుర్తుకొస్తారు. ఆయన కూడా స్టేజ్ పెర్ఫార్మెన్స్ లకు ముందుంటారు. అటు అనిరుద్ కూడా తక్కువేం తినలేదు. కాకపోతే ఇప్పుడు కీరవాణి స్టార్ట్ చేసిన ఈ కల్చర్‌ని ఇమీడియేట్‌గా భుజాలకెత్తుకునే మ్యూజిక్ డైరక్టర్ ఎవరు? అనేది ఇంట్రస్టింగ్ టాపిక్.

ప్రీ రిలీజ్ వేడుకలు ఎన్ని జరిగినా సినిమాలోని పాటలన్నిటినీ కలిపి ఆడియో లాంచ్ చేస్తే ఆ కిక్కే వేరబ్బా అని అంటున్నారు సంగీత ప్రియులు. ఒకప్పుడు ఆడియన్స్ తో సెంట్ పర్సెంట్ మార్కులు వేయించుకున్న ఆ వేడుకలు మళ్లీ పురుడు పోసుకుని కళకళలాడుతాయా? పాటల పండగ చేయడానికి మేకర్స్ ముందుకొస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ...