
నా పేరు రికార్డుల్లో ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డులుంటాయి. మొన్నటి వాల్తేరు వీరయ్యలో చిరంజీవి చెప్పిన డైలాగ్ ఇది. దీనికి తగ్గట్లే ఎన్నో రికార్డులు ఇప్పటికే మెగాస్టార్ పేరు మీదకొచ్చాయి.

ఆ సినిమా పూర్తయిన తరువాత చిరంజీవి సినిమాను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా వరుసగా యంగ్ టీమ్‌తో వర్క్ చేస్తూ యంగ్ జనరేషన్‌కు గట్టి పోటి ఇస్తున్నారు మెగాస్టార్.

45 ఏళ్ళ కింద సరిగ్గా ఇదే రోజు.. అంటే 1978 సెప్టెంబర్ 22న చిరు నటించిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు విడుదలైంది. నాలుగున్నర దశాబ్దాలుగా ఇండియన్ సినిమాలో ఓ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్నారు చిరు.

ఈ ప్రయాణంలో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న చిరంజీవి.. ఇప్పుడు గిన్నీస్ రికార్డ్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు.

చిరంజీవి అంటేనే డాన్సులు.. డాన్స్ అంటేనే చిరంజీవి. ఒకప్పుడు పాటలొస్తే థియేటర్స్ నుంచి బయటికి వెళ్లే ప్రేక్షకుల్ని.. కేవలం పాటల కోసమే థియేటర్‌కు తీసుకొచ్చే స్థాయికి తెలుగు సినిమాను చేర్చారు చిరు.

ఈ డాన్సులే ఇప్పుడాయన్ని గిన్నీస్ బుక్‌లో చేర్చాయి. 156 సినిమాల్లో.. 537 పాటల్లో.. 24000 డాన్స్ మూవ్స్ చేసారు చిరంజీవి. ప్రపంచంలోనే డ్యాన్సుల్లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్న తొలి నటుడిగా అరుదైన రికార్డు సృష్టించారు చిరంజీవి.

తనకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టమని.. నటన కంటే డాన్స్‌పైనే తనకు ఎక్కువ ఇష్టం ఉండేదని చెప్పుకొచ్చారు మెగాస్టార్. ఎంతైనా డాన్సుల్లో గిన్నీస్ రికార్డ్ అంటే చిన్న విషయం కాదు.. మెగాస్టార్ అంటే ఆ మాత్రం ఉంటది మరి.