Chiranjeevi: దర్శకులకు ఛాలెంజ్ ఇచ్చిన చిరు.. దాన్ని స్వీకరించే దమ్ము టాలీవుడ్ ఎవరికి ఉంది

Edited By: Phani CH

Updated on: Jun 24, 2025 | 8:26 PM

నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారతా అని చెప్పడం చిరంజీవికి చాలా చిన్న విషయం. జస్ట్ ఒక మాట అలా అనేస్తే చాలు.. కానీ నిజంగా మెగాస్టార్‌తో సపోర్టింగ్ రోల్స్ చేయించేంత సత్తా మన దర్శకులకు ఉందా..? చిరంజీవి ఇమేజ్ బ్యాలెన్స్ చేస్తూ ఆయన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మార్చేంత కథ మనోళ్లు రాస్తారా..? చిరు ఇచ్చిన మెగా ఆఫర్ తీసుకునే దర్శకుడు టాలీవుడ్‌లో ఉన్నారా..?

1 / 5
చిరంజీవి.. ఈ పేరు చెప్తుంటేనే ఓ వైబ్రేషన్ వస్తుంది.. చుట్టూ ఒక ఆరా ఉంటుంది.. ఇమేజ్ రీ సౌండింగ్ వస్తుంది. ఒకటి రెండు కాదు.. 45 ఏళ్లకు పైగానే ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఛాప్టర్ రాసుకున్న నటుడు మెగాస్టార్.

2 / 5
ఆయనతో సినిమా చేయాలని కలలు గనే దర్శకులు ఎంతోమంది. అలాంటి నటుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తానంటున్నారిప్పుడు. సీనియర్ హీరోలు ఇంకెన్నాళ్లు హీరోయిన్లతో ఇలా డ్యూయెట్లు పాడతారు..? వాళ్లు కూడా వయసుకు తగ్గ పాత్రలు చేయాలి కదా అని చాలా రోజులుగా డిమాండ్స్ వస్తున్నాయి.

3 / 5
అందుకే బాలయ్య అలాంటి పాత్రలే చేస్తున్నారు. నాగార్జున కూడా కుబేరాలో సపోర్టింగ్ రోల్ చేసారు.. కూలీలో విలన్‌గా నటిస్తున్నారు. ఇకపై ఈ తరహా పాత్రలే చేస్తానంటూ దర్శకులకు ఆఫర్ ఇచ్చారు కూడా.

4 / 5
నాగార్జున అంటే ఓకే గానీ.. చిరంజీవిని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చూపించేంత సత్తా మన దర్శకులకు ఉందా.. అలాంటి కథలు రాస్తారా.. ఆయన ఇమేజ్‌ బ్యాలెన్స్ చేసే స్టోరీస్ రాస్తారా అనేది ఛాలెంజ్. కథ నచ్చితే OTTలో కూడా ఓకే అంటున్నారు చిరంజీవి. అది ఆయనకు చిన్నమాటే గానీ.. దాన్ని మెటీరియలైజ్ చేయాలంటే మాత్రం దర్శకులకు చాలా పెద్ద రిస్క్.

5 / 5
చిరంజీవితో సపోర్టింగ్ రోల్ చేయించాలంటే ఆ కథకు ఎంత స్టేచర్ ఉండాలి..? అలాంటి కథ రాసిన రోజు మెగాస్టార్ మాటలు నిజమవుతాయి. కచ్చితంగా మన సీనియర్ హీరోలతో మార్పు అయితే మొదలైంది. ఆ మార్పును స్వాగతించి.. వాళ్ళ ఇమేజ్‌కు సరిపోయే కథలు రాసే బాధ్యత మాత్రం దర్శకులపైనే ఉంది. మరి చూడాలిక.. చిరును ఈ తరహా పాత్రలో చూపించే దర్శకుడెవరో..?