
ఇవాళ్రేపు సినిమాలను మిస్ అయినా పెద్దగా ఫరక్ పడేటట్టు లేదుగానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్లను మాత్రం పక్కాగా ఫాలో కావాల్సిందే.

కావాల్సినంత న్యూస్, మసలా అక్కడే దొరుకుతోందన్నది మెల్లిగా స్ప్రెడ్ అవుతోంది... ఇంతకీ మట్కా ఈవెంట్లో వరుణ్‌తేజ్ మాటలు మీరు విన్నారా.. మీకేం అర్థమైంది.?

నేనింతే.. మా పెదనాన్నని, బాబాయ్‌నీ, అన్ననీ గుర్తుచేసుకుంటాను. నేను ఎక్కడున్నా.. ఎక్కడి నుంచి వచ్చానన్న విషయాన్ని మర్చిపోను.. అటూ ఇటూగా ఇవే మాటలు చెప్పారు వరుణ్‌తేజ్.

అయితే ఆ మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి.? మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వరుణ్‌తేజ్ మాట్లాడిన మాటల గురించి భారీగా చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్‌ని ఉద్దేశించే అన్నారని కొందరు,

ఈ నెల 14న విడుదల కానున్న మట్కా సినిమాకి హైప్ క్రియేట్ చేసుకోవడానికి వాయిస్ పెంచారని మరికొందరు.. రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.

ఆ మధ్య క, జితేందర్‌రెడ్డి ప్రీ రిలీజుల్లో హీరోలు ఆవేశపడినట్టే.. మట్కా ప్రీ రిలీజ్‌లోనూ వరుణ్ ఆవేశ పడ్డారా.? లేకుంటే, నిజంగానే ఎవరినైనా ఉద్దేశించే ఈ మాటలన్నారా.?

ఎప్పుడో ఒకప్పుడు వరుణ్‌తేజ్ ఓపెన్ అయితేగానీ.. ఈ డౌట్స్ క్లియర్ కావు. అప్పటిదాకానో, మరో ఇంట్రస్టింగ్ టాపిక్ షురూ అయ్యే వరకో.. ఈ మాటల గురించి డిస్కషన్ మాత్రం ఆగదన్నదే నిజం.