
రాసి పెట్టుకోండి.. ఈ సారి రామ్ చరణ్ బర్త్ డే మామూలుగా ఉండదు.. శానా ఏళ్లు గుర్తుంటది అంటున్నారు అభిమానులు. దానికి తగ్గట్లుగానే దర్శక నిర్మాతలు కూడా చాలా ప్లాన్ చేస్తున్నారు. అసలేం ప్లాన్ చేస్తున్నారు.. చరణ్ పుట్టిన రోజు ఈసారి ఎలా ఉండబోతుందో తెలియాలంటే.. ఈ స్టోరీ తప్పకుండా చూసేయాల్సిందే.

అప్పుడు మీకే తెలుస్తుంది ఈ సారి చరణ్ బర్త్ డే స్పెషల్ ఏంటో..? రామ్ చరణ్ పుట్టిన రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నారు అభిమానులు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఈ సారి చరణ్ బర్త్ డేకు చాలా స్పెషల్స్ ఉన్నాయి.

అందుకే ఆ ఎదురు చూపులన్నీ. మరీ ముఖ్యంగా గేమ్ ఛేంజర్ నుంచి జరగండి జరగండి అంటూ సాగే పాట విడుదల కానుంది. అదే రోజు బుచ్చిబాబు సినిమా అప్‌డేట్ కూడా రానుంది. గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ వైజాగ్‌లో మొదలైంది.

దీన్నే తన పొలిటికల్ ఇమేజ్ కోసం వాడుకోవాలని చూస్తున్నారు దళపతి. అందుకే వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు.

దీనికి పెద్ది అనే టైటిల్ ప్రచారంలో ఉంది. స్పోర్ట్స్ నేపథ్యంలో బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. RC16లో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు అందరికీ తెలిసినవే. కానీ చరణ్ పుట్టిన రోజున మరో సినిమా ప్రకటన కూడా ఉండబోతుంది.

అదే సుకుమార్, రామ్ చరణ్ ప్రాజెక్ట్. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతుందని తెలుస్తుంది. రంగస్థలం తర్వాత మరోసారి సుక్కుతో చరణ్ సినిమా చేయబోతున్నారు. సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్నారు.

దీని తర్వాత పుష్ప 3 ఉంటుందనే ప్రచారం జరుగుతున్నా.. దీనిపై అధికారిక సమాచారం రాలేదు. దాంతో చరణ్‌తో మరో సినిమాకు లెక్కల మాస్టారు కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. వీటన్నింటితో పాటు నాయక్ సినిమా రీ రిలీజ్, ఆరెంజ్ స్పెషల్ షోస్ కూడా ప్లాన్ చేస్తున్నారు.