Ram Charan: తండ్రి అయిన తరువాత ఫస్ట్ టైం సెట్స్ లో అడుగు పెట్టిన రామ్ చరణ్..
తిరిగి సెట్‌లో అడుగుపెట్టారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ మధ్యే తండ్రి పోస్ట్‌కు ప్రమోట్ అయిన చెర్రీ, షార్ట్ బ్రేక్ తరువాత కెమెరా ముందుకు వచ్చేశారు. ఇప్పటికే ఆలస్యం కావటంతో గేమ్ చేంజర్ వర్క్ వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యారు.ట్రిపులార్ సినిమా సెట్స్ మీద ఉండగానే శంకర్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశారు రామ్ చరణ్. భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేసిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ రెండేళ్లుగా సెట్స్ మీదే ఉంది. చరణ్ సీఎంగా, గవర్నమెంట్ ఆఫీసర్‌గా డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.