లేక లేక గేమ్ ఛేంజర్ అప్‌డేట్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. వాటిని ఎంజాయ్ చేయడం కూడా ఈ మధ్యే మొదలు పెట్టారు ఫ్యాన్స్. అంతలోనే వాళ్లకు అదిరిపోయే ట్విస్టులు ఎదురవుతున్నాయి.
ట్రిపుల్ ఆర్‌లో చరణ్ పెర్ఫార్మెన్స్ స్కిల్స్ చూసిన వారు, మరేం ఫర్వాలేదు... ఇక ఎలాంటి రోల్‌లో అయినా చరణ్ ఇరగదీస్తాడు అని ఫిక్సయ్యారు. ఆ రేంజ్‌లో మెప్పించారు చెర్రీ. ఎమోషన్స్, యాక్షన్, డిక్షన్.. అన్నిటిలోనూ పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.
ఆ తర్వాత తండ్రితో కలిసి నటించిన ఆచార్యలోనూ తన పార్టు కేక అనిపించేలా చేశారు. సినిమా ఫ్లాప్ కావడంతో శ్రమ వృథా అయిందన్నది వాస్తవం. ఇప్పుడు చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్.
ఇందులో డ్యూయల్ రోల్స్ లో కనిపిస్తారు. ఈ సినిమా చెర్రీ కెరీర్‌లో ది బెస్ట్ మూవీ అవుతుందనే మాటను కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు దిల్‌రాజు. శంకర్ ఈ సినిమాతో హిట్ కొట్టడం పక్కా అనే మాట కూడా వినిపిస్తోంది.
గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబు సెట్స్ కి వెళ్తారు రామ్‌చరణ్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనుంది ఈ సినిమా. ఈ చిత్రంలోనూ చెర్రీ ద్విపాత్రాభినయం చేస్తారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటిదాకా టచ్ చేయని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కోసం ఫ్యాన్స్ కూడా ఈగర్‌గానే వెయిట్ చేస్తున్నారు.
గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఇలా బయటికొచ్చిందో లేదో.. అప్పుడే అభిమానుల్లో కంగారు మొదలైంది. మరి ఆ టెన్షన్‌కు కారణమేంటి.?
దాంతో చరణ్ సినిమాకు అక్కడ స్క్రీన్స్ తక్కువగా దొరికే ఛాన్స్ ఉంది. మరోవైపు హిందీలో క్రిస్మస్‌కు బేబీ జాన్‌తో పాటు అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ రానున్నాయి.