కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు మీనాక్షి చౌదరి. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇటీవలే హిట్ ది కేస్ 2 సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో మీనాక్షికు ఫుల్ క్రేజ్ వచ్చేసింది.
దీంతో వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న గుంటూరు కారం చిత్రంలో నటించే ఛాన్స్ అందుకుంది. ఇందులో పూజా హెగ్డే స్థానంలోకి చేరిపోయింది మీనాక్షి. ఈ సినిమాలో మీనాక్షి కన్ఫార్మ్ అయిందనే వార్తలు రావడంతో సోషల్ మీడియాలో మీనాక్షి ఫాలోయింగ్ పెరిగిపోయింది.
ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుస అవకాశాలు క్యూ కట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వరుణ్ తేజ్ జోడిగా మట్కా చిత్రంలో నటించనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అలాగే విశ్వక్ సేన్ కొత్త సినిమాలోనూ కనిపించనుంది.
అంతేకాకుండా దుల్కర్ సల్మాన్ నటించబోయే లక్కీ భాస్కర్ సినిమాలో కథానాయికగా నటించనుంది. తెలుగు, మలయాళంలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు బంపర్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ బ్యూటీ కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి సరసన నటించనుందట. విజయ్ 68వ సినిమా వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మీనాక్షిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం మీనాక్షి చేతిలో 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ చిత్రాలు అన్ని వచ్చే ఏడాదిలో రిలీజ్ కాబోతున్నాయి. అంటే నెక్ట్స్ ఇయర్ మీనాక్షి ఫుల్ ఫాంలో ఉండబోతుందని తెలుస్తోంది.