
ఈ ఏడాది ప్రారంభంలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది మీనాక్షి చౌదరి. గతేడాది సైతం లక్కీ భాస్కర్ సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఇప్పుడు ఈ అమ్మడు తన సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్టవ్వడం ఖాయమని టాక్. ఇక ఇప్పుడు తెలుగుతోపాటు తమిళంలోనూ ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా ఈ అమ్మడు నెట్టింట గ్లామర్ ఫోటోష్ షేర్ చేస్తూ అభిమానులకు షాకిస్తుంది. ఇటీవల వైట్ డ్రెస్ లో గ్లామర్ లుక్స్ తో నెట్టింట అరాచకం సృష్టించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఆకుపచ్చ చీరకట్టులో మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన అందమైన ఫోటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగచైతన్యకు జోడిగా ఓ సినిమాలో నటిస్తుంది మీనాక్షి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే నవీన్ పొలిశెట్టి సరసన అనగనగ ఒక రాజు చిత్రంలోనూ ఈ అమ్మడు నటిస్తుంది. ఈ మూవీ ఈ ఏడాదిలో అడియన్స్ ముందుకు రానున్నట్లు సమాచారం.

ఇవే కాకుండా తెలుగులో మరో రెండు సినిమాలకు కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో రెండు సినిమాలు.. వచ్చే సంవత్సరంలో మరిన్ని సినిమాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ రెండేళ్లు వరుసగా హిట్స్ అందుకోవాలని చూస్తోంది మీనాక్షి. అటు తమిళంలోనూ ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం.