
అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఇచ్చట వాహనాలు నిలపరాదు అనే మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే కుర్రకారు మదిని దోచేసింది. తర్వాత మాస్ మహారాజా రవితేజ సరసన ఖిలాడీ సినిమాలో ఛాన్స్ కొట్టేసి ఈ మూవీలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.

అయితే ఈ బ్యూటీ రెండు సినిమాలు చేసినప్పటికీ ఆశించిన రేంజ్‌లో మాత్రం గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. ఈ మూవీ తర్వాత మీనాక్షి చౌదరి, అడవి శేషు సరసన హిట్ 2, తర్వాత లక్కీ భాస్కర్, గుంటూరు కారం వంటి సినిమాల్ల నటించింది. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ సరసన సంక్రాంతికి వస్తున్నా మూవీలో మెరిసింది.

ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకొని, కుర్రకారు ఫేవరెట్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు కలిసి వచ్చిందనే చెప్పాలి. తర్వాత వరసగా హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఈ చిన్నది పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక ఇప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తాజాగా కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ అమ్మడు అందం చూస్తే ఎవ్వరైనా ఫిదా అయిపోవాల్సిందే. వైట్ చీరలో చాలా క్యూట్‌గా కనిపించింది.

అయితే తాజాగా ఈ బ్యూటీ గామా అవార్డ్స్ ఈవెంట్‌లో మెరిసింది. వైట్ అండ్ గ్లోడ్ కలర్ చీరలో బ్యూటిఫుల్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ ఈ అమ్మడు తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి.