
అందాల చిన్నది మీనాక్షి చౌదరి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ బ్యూటీ ఇచ్చట వాహనాలు నిలపరాదు అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది.

ఇక ఈ మూవీ తర్వాత ఈ అమ్మడుకు లక్కు కలిసి వచ్చిందనే చెప్పాలి వరసగా సినిమాల్లో ఛాన్స్‌లు అందుకుంది. ముఖ్యంగా అడవి శేషు హిట్ 2 సినిమాతో అదృష్టంతలుపు తట్టింది. ఈ మూవీతో హిట్ అందుకోవడంతో వరసగా ఈ బ్యూటీకి ఛాన్స్‌లు వచ్చాయి.

హిట్ 2 తర్వాత ఈ ముద్దుగుమ్మ గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాలతో వరసగా హిట్స్ అందుకుంటూ, టాలీవుడ్ లక్కీ హీరోయిన్‌గా మారిపోయిది.

మరీ ముఖ్యంగా వెంకటేష్ సరసన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో నటించి, ఈ మూవీలో వెంకటేష్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో ఇరగదీసిందనే చెప్పాలి. ఈ మూవీతో ఈ అమ్మడుకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. తర్వాత మళ్లీ సంక్రాంతి పండుగకు నవీన్ పోలిశెట్టి సరసన అనగనగా ఒక రాజు సినిమాలో నటించి, మంచి సక్సెస్ అందుకుంది.

ఇక వరస విజయలతో ఫుల్ జోష్‌లో ఉన్న ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పట్టు పరికిణిలో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. ఇవి తెలుగు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.