
టాలీవుడ్ యంగ్ హీరో, టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్ బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పాడు. ఎలాంటి హడావిడి, హంగామా లేకుండా పెళ్లిపీటలెక్కాడు. తన ప్రియురాలు కల్పన రావు మెడలో మూడు ముళ్లు వేసి జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు.

ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో తిరువీర్ పెళ్లి వేడుక గ్రాండ్ గా జరిగింది. వివాహం ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. తిరువీర్ స్వయంగా తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు

తన పెళ్లి ఫొటోలకు 'కొత్త ఆరంభం' అంటూ లవ్ సింబల్‍లను క్యాప్షన్‍గా జత చేశాడు. హల్దీ వేడుకతో పాటు పెళ్లికి సంబంధించిన ఫొటోలను కూడా తిరువీర్ పంచుకున్నారు

రంగారెడ్డి జిల్లాలోని మామిడిపల్లికి చెందిన తిరువీర్ 'మసూద’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పరేషాన్, జార్జ్ రెడ్డి, పలాస 1978 సినిమాల్లోనూ అతని అభినయానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

ప్రస్తుతం తిరువీర్ పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.