Mammootty: మలయాళం మెగాస్టార్ లైన్ మార్చారా.! ఆ సినిమాలో ఆయన కాబట్టి చేసారా.!
ప్రయోగాలు చేస్తుంటేనే ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ క్రియేట్ అవుతుందని నమ్మే హీరో మమ్ముక్కా. ఆయన రీసెంట్ రిలీజులే కాదు, ప్రస్తుతం సెట్స్ మీదున్న సినిమాల్లోనూ అదే ఫార్ములాను రిపీట్ చేస్తున్నారు. మలయాళ టాప్ స్టార్ మమ్ముట్టికి మన దగ్గర స్పెషల్ ఇంట్రడక్షన్ అక్కర్లేదు. అయినా యాత్ర పార్ట్ ఒన్ అండ్ పార్ట్ టూతో తెలుగు ప్రేక్షకులకు రీసెంట్ టైమ్స్ లో మరింత దగ్గరయ్యారు మలయాళ మెగాస్టార్.