- Telugu News Photo Gallery Cinema photos Malayalam actress Honey Rose reveals about her costume secrets
Honey Rose: తన డ్రసింగ్ సెన్స్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన హనీరోజ్
ప్రస్తుతం మలయాళం, మరియు తెలుగుతో సహా అనేక భాషలలో నటిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Updated on: Oct 17, 2024 | 9:39 PM

బాయ్‌ఫ్రెండ్ సినిమాతో మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన హాట్ బ్యూటీ హనీ రోజ్. ఈ ముద్దుగుమ్మ ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ప్రస్తుతం మలయాళం, మరియు తెలుగుతో సహా అనేక భాషలలో నటిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది హనీరోజ్.

వీరసింహ రెడ్డి సినిమా తర్వాత ఇంతవరకు మరో సినిమాలో నటించలేదు హనీరోజ్. సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది హనీరోజ్.

సినిమాలకంటే బట్టల షాప్ ఓపినింగ్స్ తోనే ఎక్కువ సమయం గడిపేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా తన డ్రసింగ్ సెన్స్ గురించి మాట్లాడింది. తన కోసం బట్టలు సెలక్ట్ చేసింది తన తల్లి అని చెప్పింది హానీ రోజ్. నా కాస్ట్యూమ్ బాధ్యత మా అమ్మదే. ఆమె చెప్పింది నేను వింటాను అని హనీ చెప్పింది.

హనీకి బట్టలు కొనేది ఆమె అమ్మ అని చెప్పింది. హనీ రోజ్ మాట్లాడుతూ.. హనీరోజ్ కు పుట్టినప్పటి నుంచి ఫ్యాషన్ సెన్స్ ఉంది. హనీ ఎప్పుడూ రెడీగా, టాప్ గా ఉండాలని కోరుకుంటుంది. చిన్నప్పటి నుంచి హనీని ఎక్కడికైనా బాగా రెడీ చేసి తీసుకెళ్ళేదాన్ని అని ఆమె తల్లి అన్నారు.





























