
డ్రీమ్ రోల్ గురించి స్పందించారు నటి మాళవిక మోహనన్. తనకు గ్యాంగ్‌స్టర్‌గా నటించాలని ఉందని అన్నారు. ప్రస్తుతం తాను యాక్షన్ సీక్వెన్సుల్లో శిక్షన తీసుకుంటున్నట్టు తెలిపారు. మహిళలు కూల్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తే చూడ్డానికి బావుంటుంది కదా అంటూ నెటిజన్లను ప్రశ్నించారు. ప్రస్తుతం ఈమె చేతిలో తమిళంలో తంగలాన్, తెలుగులో రాజా సాబ్ సినిమాలున్నాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని శంకర్ తెరకెక్కిస్తున్నారు. కియారా అద్వానీ నాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫైనల్ స్టేజెస్‌లో ఉంది. ఈ చిత్రం పనులు పూర్తికాగానే బుచ్చిబాబు సానా సెట్స్ కి వెళ్తారు రామ్ చరణ్. జూన్ ఆఖరునగానీ, జులైలోగానీ ఆ సినిమా షూటింగ్ మొదలవుతుందని టాక్.

Gam Gam Ganఆనంద్ దేవరకొండ కెరీర్‌లో నటిస్తున్న తొలి యాక్షన్ సినిమా గం గం గణేశా. మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. సరికొత్త కంటెంట్‌తో ఈ సమ్మర్‌లో అన్ని వర్గాల వారినీ ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నామని అంటున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని హై లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు.esha

ఆర్టికల్ 370కి వస్తున్న స్పందన చూస్తే చాలా ఆనందంగా ఉందని అన్నారు నటి యామీ గౌతమ్. తన ఇన్నాళ్ల కల నిజమైందని, అందుకు ఆనందంగా ఉన్నానని చెప్పారు. యామీ గౌతమ్, ప్రియమణి నటించిన ఆర్టికల్ 370 థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. 50 రోజుల రన్ చూసింది. ఇప్పుడు ఓటీటీల్లోనూ ప్రశంసలు అందుకుంటోంది.

రణ్‌వీర్ సింగ్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించడానికి సన్నద్ధమవుతోంది. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్‌లోనే ఈ సినిమా కూడా ఉంటుందని టాక్. ఈ చిత్రం తర్వాత జై హనుమాన్‌ని మొదలుపెడతారు ప్రశాంత్ వర్మ.