యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్‌లో ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్న మేకర్స్. ఆల్రెడీ సక్సెస్ అయిన ఓ ఫార్ములాను రీ ఇంప్టిమెంట్ చేసే ప్లాన్‌లో ఉంది.
ట్రిపులార్ తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న తారక్ ప్రస్తుతం దేవర వర్క్‌లో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా లాక్ అవ్వటంతో వీలైనంత త్వరగా సినిమాను ఫినిష్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ న్యూ ఇయర్ వెకేషన్‌కు వెళ్లిన జూనియర్, తిరిగి వచ్చిన వెంటనే షూటింగ్ రీస్టార్ట్ చేస్తారు.
షూటింగ్ విషయంలోనే కాదు రిలీజ్ విషయంలో కూడా ఇప్పటి నుంచే పక్కా ప్లాన్ రెడీ చేస్తోంది దేవర టీమ్. సంక్రాంతి కానుకగా టీజర్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిన మేకర్స్, అప్పటి నుంచి వరుస అప్‌డేట్స్ ఇవ్వాలనుకుంటున్నారు. అంతేకాదు ట్రిపులార్ విషయంలో సక్సెస్ అయిన ఓ ఫార్ములాను దేవర విషయంలోనూ ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో ఉన్నారు.
ట్రిపులార్ ప్రమోషన్స్‌లో అందరికన్నా ఎక్కువ హైలెట్ అయ్యింది తారకే. వెళ్లిన ప్రతీ స్టేట్‌లోనూ అక్కడి లోకల్ లాంగ్వేజ్‌లో మాట్లాడుతూ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు జూనియర్. ఆ ఇమేజ్‌ను దేవర విషయంలో కూడా క్యాష్ చేసుకోవాలనుకుంటోంది యూనిట్.
తారక్ సోలో హీరోగా చేస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ కావటంతో ప్రమోషన్ యాక్టివిటీస్ అన్నీ తారక్ సెంట్రిక్‌గానే ప్లాన్ చేస్తున్నారు. అందుకే జనవరి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరి ఈ ప్లానింగ్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.