టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ 'గుంటూరు కారం'. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబో వస్తున్న ఈ సినిమా కోసం ఘట్టమనేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్, సాంగ్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు.