
కేజీయఫ్ కీ.. కేజీయఫ్2కీ యాక్షన్ విషయంలోనూ, థీమ్ విషయంలోనూ పోలిక ఉంటే ఉండొచ్చేమోగానీ, గ్రాండియర్ విషయంలోనూ, స్టార్ కాస్ట్ విషయంలోనూ చాలా బిగ్ వేరియేషన్ ఉంది. సంజయ్ దత్ ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది... ఏమంటారూ.. అంతేనా!

పుష్ప2 చూసిన వారికి కూడా ఆ వేరియేషన్ కనిపించింది. ఫస్ట్ పార్టుకి సెకండ్ పార్టుకీ నిచ్చెనేసి ఎక్కినంత దూరం కనిపించింది ఆడియన్స్ కి. రావు రమేష్, జగపతిబాబు, తారక్ పొన్నప్ప.. ఇలా సెకండ్ పార్టులో వేల్యూ యాడెడ్ కంటెంట్ చాలానే.

ఇప్పుడు దేవర 2 లోనూ ఈ హంగామాని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. మొదటి నుంచీ ఊరిస్తున్న యతి కేరక్టర్ ఎవరు చేస్తారా? ఎలా చేస్తారా? మంచి వ్యక్తిగా చూపిస్తారా? క్రూయల్ టు ద కోర్ అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తారా? ఇలా బోలెడంత క్యూరియాసిటీ కనిపిస్తోంది ఫాలోయర్స్ లో.

కల్కి2 లో పాత కేరక్టర్లు కంటిన్యూ కావచ్చు.. కొత్త పాత్రలు యాడ్ కావచ్చంటూ ఆ మధ్య అశ్వనీదత్ అన్న మాటలను గుర్తుచేసుకుంటున్నారు రెబల్ ఫ్యాన్స్.

సలార్ సీక్వెల్ కోసం ప్రశాంత్ నీల్ ఏదో స్పెషల్ ప్యాకేజ్ క్రియేట్ చేసే ఉంటారన్నది వారి నమ్మకం. అటు కల్కి2, ఇటు సలార శౌర్యాంగపర్వం.. సీక్వెల్స్ కోసం వెయిటింగ్ ప్రభాస్ ఫాలోయర్స్.