3 / 5
వద్దురా, సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటరా అంటూ గతంలో తెలుగులో పాపులర్ అయిన పాటను పదే పదే పాడుకుంటున్నారు ఆండ్రియా జర్మియా. తనలో తాను హమ్ చేసుకోవడం కాదు, ఓపెన్‌గా అందరి ముందు కూడా పాడుతున్నారు. స్వతహాగా సింగర్ ఆండ్రియా. మంచి నటిగా కూడా పేరు తెచ్చుకున్నారు. చేతినిండా సినిమాలతో క్షణం తీరికలేదు అని స్టేట్‌మెంట్ ఇచ్చేటంత బిజీగా లేకపోయినా, అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య తెలుగులో వెంకటేష్ సైంధవ్ సినిమాలో నటించారు ఆండ్రియా. తనకి పెళ్లి చేసుకోవాలని అనిపించడం లేదన్నది ఈ బ్యూటీ చెబుతున్న మాట. ఒకానొకప్పుడు పెళ్లి గురించిన ఆలోచనలు వచ్చేవట. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి థాట్స్ రావడం లేదని చెబుతున్నారు ఆండ్రియా.