
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో డైరెక్టర్ రాజమౌళి రూపొందిస్తున్న సినిమా వారణాసి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇటీవలే ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయగా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, మహేష్ ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ చేశారు.

ఇదెలా ఉంటే.. తాజాగా మహేష్ బాబు న్యూలుక్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. లైట్ స్కై బ్లూ టీషర్ట్.. నేవీ బ్లూ కలర్ జాకెట్ లో.. లాంగ్ హెయిర్.. గడ్డంతో అచ్చం హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు మహేష్. ఇప్పుడు ప్రిన్స్ న్యూలుక్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

50 ఏళ్ల వయసులో పాతికేళ్ల కుర్రాడిలా అద్భుతమైన ఫిట్‌నెస్ తోపాటు.. స్టైలీష్ లుక్ లో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు మహేష్. నిజానికి మహేష్ లుక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన ఫిట్నెస్, డైట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.

ఇటీవల గ్లోబ్ ట్రోటర్ వేడుకలోనూ తన లుక్ పూర్తిగా రిఫ్రెష్ గా.. అందరినీ ఆకట్టుకునేలా ఉంది. లైట్ యెల్లో కలర్ ఇంటర్నల్ షర్ట్ పై బ్రౌన్ జాకెట్ వేసుకోవడం.. కంఫర్టబుల్ స్టైల్ ప్యాంట్ కాంబోలో స్క్రీన్ పైనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లోనూ ఎంతో న్యాచురల్ స్టైలీష్ లుక్ లో కనిపించారు.