
ఎస్‌ఎస్‌ఎంబీ 29 షూట్‌కు ముందే మహేష్ పాస్‌పోర్ట్ లాగేసుకున్నా అని ఫన్నీగా ఓ పోస్ట్ పెట్టారు రాజమౌళి. షూటింగ్ స్టార్ట్ అయిన తరువాత కూడా బ్యాక్ టు బ్యాక్ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసి స్పీడు చూపించారు.

కానీ సడన్‌గా ఫ్యామిలీతో కలిసి మహేష్ ఫారిన్ ట్రిప్‌కు ఫ్లైట్ ఎక్కేయటంతో ఆడియన్స్ షాక్ అయ్యారు. మహేష్ ఇలా ఫ్యామిలీ వెకేషన్స్‌కు బ్రేక్ తీసుకుంటే సినిమా ఎప్పటికి పూర్తి కావాలని టెన్షన్ పడ్డారు.

మహేష్ షూటింగ్ ఏమాత్రం డిస్ట్రబ్ అవ్వకుండానే ఈ వెకేషన్ ట్రిప్‌ను ప్లాన్ చేశారట. ఒడిశా షెడ్యూల్ తరువాత ప్రీ ప్రొడక్షన్ కోసం రాజమౌళి తీసుకున్న బ్రేక్ టైమ్‌లోనే మహేష్ తన వెకేషన్‌ను కంప్లీట్ చేశారు.

జస్ట్ పది రోజుల్లోనే ట్రిప్ ముగించుకొని ఇండియాకు తిరిగి వచ్చేశారు. వెంటనే షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు ప్రీపేర్ అవుతున్నారు. మహేష్ తిరిగి వచ్చిన వీడియో వైరల్ కావటంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

ఇప్పటికే మహేష్ సినిమా రిలీజ్ 15 నెలలు దాటిపోయింది. రెగ్యులర్‌గా ఫ్యామిలీ వెకేషన్‌కు వెళ్తు రాజమౌళి సినిమా కంప్లీట్ చేయాలంటే మరో రెండేళ్లు టైమ్ పడుతుంది. అందుకే బ్రేక్ లేకుండా షూటింగ్ చేస్తే కనీసం ఏడాదిన్నరలో మళ్లీ మహేష్‌ను తెర మీద చూడొచ్చని ఫీల్ అవుతున్నారు అభిమానులు.