Mahesh Babu: టాలీవుడ్లో హాలీవుడ్ హీరో.. మహేష్ బాబు నయా స్టైలీష్ లుక్స్.. జక్కన్న సినిమా కోసమేనా..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన గుంటూరు కారం గ్లింప్స్ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. చాలా కాలం తర్వాత మాస్ యాక్షన్ సినిమాతో రాబోతున్నారు సూపర్ స్టార్.