
ప్రజెంట్ గ్లోబల్ రేంజ్‌లో బజ్ క్రియేట్ చేస్తున్న ఇండియన్ మూవీ ఎస్‌ఎస్‌ఎంబీ 29. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యే మొదలైంది. అయినా ఆల్రెడీ రిలీజ్ డేట్ విషయంలో డిస్కషన్ జరుగుతోంది. జక్కన్న కూడా ఓ లక్కీ డేట్‌ను మహేష్ మూవీ కోసం లాక్ చేసి పెట్టారన్నది ఫిలిం నగర్ అప్‌డేట్.

రాజమౌళికి గ్లోబల్ రేంజ్‌లో రికగ్నేషన్ తీసుకువచ్చిన ట్రిపులార్ రిలీజ్ డేట్‌కే ఎస్‌ఎస్‌ఎంబీ 29ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే అది ఈ ఏడాదో వచ్చే ఏడాదో కాదు.. ఆ పై వచ్చే ఏడాదిలో. అంటే 2027 మార్చి 25న ఎస్‌ఎస్‌ఎంబీ 29 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి.

జక్కన్న మాత్రమే కాదు తారక్ - నీల్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. ఇంకా జూనియర్ సెట్‌లో అడుగుపెట్టకపోయినా.. అప్పుడే రిలీజ్ డేట్ విషయంలో డెసిషన్ తీసేసుకున్నారట చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్.

స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్లాన్ చేసిన ఎన్టీఆర్ సినిమాను కేజీఎఫ్ 2 రిలీజ్ అయిన ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2026లోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే ఇక్కడ ఏడాది వేచి చూడాల్సిందే.

Akhanda 2