ఇటీవల జైలర్‌తో బంపర్ హిట్ అందుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్‌ని అంతకుమించిన స్టోరీతో మెప్పించడానికి రెడీ అవుతున్నారు లోకేష్. తలైవర్‌కి రీసెంట్‌గా చెప్పిన ఔట్‌లైన్ నచ్చడంతో డీటైల్డ్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు లోకేష్.
ఒన్స్ స్క్రిప్ట్ లాక్ అవగానే, తలైవర్ సినిమాతో బిజీ అవుతారు. తలైవర్ మూవీ పోస్ట్ ప్రమోషన్స్ కంప్లీట్ కాగానే ఖైదీ సీక్వెల్ స్టార్ట్ చేయాలన్నది లోకేష్ ప్లాన్.ఖైదీ పూర్తి కాగానే లోకేష్... విక్రమ్ సినిమాకు సీక్వెల్ చేస్తారనే ప్రచారం ఉంది.
ప్రస్తుతం మణిరత్నం సినిమాతో బిజీగా ఉన్న కమల్‌హాసన్, ఆ సమయానికి ఫ్రీ అవుతారట. విక్రమ్ సీక్వెల్ మల్టీస్టారర్ సినిమా కావడంతో, స్టార్ల డేట్లు కుదిరినప్పుడే విక్రమ్ సీక్వెల్‌ని పట్టాలెక్కించాలన్నది ప్లాన్.
ఒకవేళ విక్రమ్ సీక్వెల్ పట్టాలెక్కని పక్షంలో వెంటనే లియో సీక్వెల్ మొదలవుతుంది. లియో సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటి నుంచే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందనే టాక్ నడుస్తోంది. అయితే రీసెంట్‌గా ఈ విషయాన్ని అఫిషియల్‌గా కన్‌ఫర్మ్ చేశారు లోకేష్.
ఇప్పుడు సీక్వెల్‌లో ఏం జరుగుతుందనే ఊహ అందరిలోనూ మొదలైంది. విజయ్ ఫ్లాష్‌బ్యాక్ నిజమే అంటారా? కాదంటారా? అంటూ ఎవరికి తోచిన రీతిలో వాళ్లు ఊహించుకుంటున్నారు. మీరు ఎంతైనా ఊహించుకోండి... వాటన్నిటినీ దాటేలా సినిమా ఉంటుందని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు లోకేష్. మరి మా రోలెక్స్ మాటేంటని క్యూరియస్‌గా అడుగుతున్నారు సూర్య ఫ్యాన్స్. దీని గురించి కెప్టెన్ ఏమంటారో వేచి చూడాల్సిందే.