
విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లియో. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చిన వసూళ్ల పరంగా సత్తా చాటింది. విజయ్ కెరీర్ లో మాత్రమే కాదు కోలీవుడ్ హిస్టరీ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది లియో. అయితే ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాను విజయ్ కోసం రెడీ చేయలేదట.

రీసెంట్ ఇంటర్వ్యూ లో లియో గురించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు లోకేష్ కనగరాజ్. ఎల్‌సీయూ లో భాగంగా ఇప్పటికే చాలా కథలను రెడీ చేసి పెట్టుకున్న లోకేష్, మార్కెట్ కు తగ్గట్టుగా ఆ కథ స్కేల్ ను పెంచుకుంటూ పోతున్నారు.మా నగరం సినిమాను మినిమమ్ బడ్జెట్ లోనే పూర్తి చేసిన ఈ యంగ్ డైరెక్టర్, ఆ తరువాత ఖైదీ సినిమాను కూడా అతి తక్కువ బడ్జెట్ లోనే పూర్తి చేశారు.

ఖైదీ సూపర్ హిట్ కావటంతో మాస్టర్ సినిమాకు కాస్త భారీగానే ఖర్చు పెట్టారు. విక్రమ్, లియో సినిమాలు భారీ బడ్జెట్ తో రూపొందించిన లోకేష్, కథగా అన్ని సినిమాలను ఒకే స్థాయిలో డిజైన్ చేసిన పెట్టుకున్నానని చెప్పారు. అసలు లియో కథను ఐదేళ్ల క్రితం మరో హీరో కోసం సిద్ధం చేశానని చెప్పారు.

కేరళలోనూ ఏడో రోజు రెండు కోట్లు కలెక్ట్ చేయడం ఏంటని విస్తుపోతున్నారు ట్రేడ్ పండిట్స్. మలయాళ తీరంలో విజయ్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ని గుర్తుచేసుకుంటున్నారు. హిందీలో మల్టిప్లెక్సుల్లో విడుదల కాకపోయినప్పటికీ, దాదాపు 15 కోట్లు కలెక్ట్ చేసింది లియో.

లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్శ్‌లో లియో ఎలా ఒదిగింది? లియోలో లోకేష్ యూనివర్శ్‌ని ఎలా టచ్ చేశారనే ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ థియేటర్లకు జనాలను తీసుకొస్తోంది. కార్తి ఖైదీ, కమల్‌హాసన్ విక్రమ్, రోలెక్స్ కేరక్టర్ల హింట్స్ జనాలను మెస్మరైజ్ చేస్తున్నాయి. జైలర్ గ్లోబల్ కలెక్షన్లు 604 కోట్లను లియో దాటుతుందా? లేదా? ఇప్పుడు ఇదే తమిళనాడులో పెద్ద చర్చ.