Leo: ఆదిపురుష్ రికార్డ్ ను బ్రేక్ చేసిన లియో.. బాక్సాఫీస్ షేక్ చేసిన దళపతి
2023లో ఎన్ని సినిమాలు వచ్చినా.. ఆదిపురుష్ రికార్డ్స్ మాత్రం పదిలంగానే ఉన్నాయి. రజినీకాంత్ వచ్చినా.. షారుక్ ఖాన్ వచ్చినా వాటిని మాత్రం కదిలించలేకపోయారు. కనీసం దగ్గరికి కూడా రాలేకపోయారు. మరి ఈ రికార్డులను ఆకాశమంత హైప్‌తో వచ్చిన లియో అయినా కదిలించాడా..? విజయ్ కొత్త రికార్డ్స్‌కు తెర తీసారా..? లియో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత..? 2023లో ఇప్పటికీ హైయ్యస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్ ప్రభాస్ పేరు మీదే ఉంది. జూన్ 16న విడుదలైన ఈ చిత్రం.. మొదటి రోజు 137 కోట్లు వసూలు చేసింది.