Laapataa Ladies: ఆస్కార్ బరిలోకి చిన్న సినిమా.. లాపతా లేడీస్ కథ ఏంటంటే

|

Sep 23, 2024 | 9:30 PM

దీపక్‌ అనే రైతుకు కొత్తగా పెళ్లవుతుంది. పెళ్లి కూతురితో కలిసి రైల్లో సొంత ఊరికి బయల్దేరతాడు. అయితే ఆ రైల్లో నవ వధువులు చాలామంది ఉంటారు. అందరు మేలి ముసుగులు ధరించి ఉంటారు. దీంతో దీపక్‌ భార్య కాస్తా మారిపోతుంది. వేరే వధువుతో కలిసి ఇంటికి చేరుకున్నాక జరిగిన తప్పును దీపక్‌ తెలుసుకుంటాడు.

1 / 5
చిన్న సినిమా..పెద్ద ఎఫెక్ట్‌ చూపించింది. యానిమల్‌, కల్కి, మైదాన్‌, ఆర్టికల్‌-370 లాంటి సినిమాలతో పోటీ పడి ఆస్కార్‌కు నామినేట్‌ అయింది. అదే "లా పతా లేడీస్‌" మూవీ. ఇంతకూ ఈ సినిమాలో ఏముంది.? కథ ఏంటి.? అనేది చూద్దాం.!

2 / 5
దీపక్‌ అనే రైతుకు కొత్తగా పెళ్లవుతుంది. పెళ్లి కూతురితో కలిసి రైల్లో సొంత ఊరికి బయల్దేరతాడు. అయితే ఆ రైల్లో నవ వధువులు చాలామంది ఉంటారు. అందరు మేలి ముసుగులు ధరించి ఉంటారు. దీంతో దీపక్‌ భార్య కాస్తా మారిపోతుంది. వేరే వధువుతో కలిసి ఇంటికి చేరుకున్నాక జరిగిన తప్పును దీపక్‌ తెలుసుకుంటాడు. తన భార్య కోసం పోలీస్‌ స్టేషన్‌లో కంప్లయింట్‌ ఇస్తాడు.

3 / 5
తప్పిపోయిన దీపక్‌ అసలు భార్య ఓ రైల్వే స్టేషన్‌లో తల దాచుకుంటుంది. అదే లా పతా లేడీస్‌ మూవీ కథ. ఇప్పుడు ఇదే సినిమా.. యానిమల్‌, కల్కి, మైదాన్‌, ఆర్టికల్‌ 370 వంటి పెద్ద సినిమాలను తోసిరాజని వచ్చే ఏడాది ఆస్కార్‌కి భారత్‌ నుంచి అధికారికంగా నామినేట్‌ అయింది. ఫిల్మ్ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ విషయాన్ని తెలిపింది.

4 / 5
బాలీవుడ్‌ బడా స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ ఈ సినిమాను నిర్మించారు. ఆయన మాజీ భార్య కిరణ్‌రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది.

5 / 5
ముసుగు ధరించిన కారణంగా పెళ్లి కూతుళ్లు తారుమారైన కామెడీ సెటైరికల్‌ సినిమాగా ఇది కనిపించినా...సినిమాలో ఓ ఫీల్‌ గుడ్‌ ఫ్యాక్టర్‌ కనిపిస్తుంది. ఒకరికొకరు సాయం చేసుకునే మానవత్వం ఉన్న మనుషులు ఇంకా ఉన్నారనేది ఈ సినిమాలో అంతర్లీనంగా వినిపించే కథ. మహిళా సాధికారత, సమానత్వమే ఈ సినిమాలో ప్రధాన అంశాలు. ఈ చిన్న సినిమా, పెద్ద విజయం...ఏకంగా ప్రపంచం దృష్టినే ఆకర్షించింది.