Krithi Shetty: నెట్టింట సైలెంట్ అయిన బేబమ్మ.. ఇన్నాళ్లకు మళ్లీ అందంతో మాయ చేసింది..
తొలి సినిమాతోనే తెలుగు అడియన్స్ హృదయాలను దొచేసింది హీరోయిన్ కృతి శెట్టి. ఉప్పెనలా ఇండస్ట్రీలోకి దూసుకువచ్చి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. డైరెక్టర్ బుచ్చిబాబు రూపొందించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. నిజానికి ఉప్పెన తర్వాత కృతికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది బేబమ్మ. అందులో బంగర్రాజు, శ్యామ్ సింగరాయ్ చిత్రాలు మాత్రమే హిట్ అయ్యాయి.