
విక్రమ్‌తో కమల్ హాసన్, జైలర్‌తో రజనీ కాంత్ ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. చాలా ఏళ్ల తరువాత బ్లాక్ బస్టర్ హిట్ దక్కటంతో ఆ టెంపోను అలాగే మెయిన్‌టైన్ చేయాలని ఫిక్స్ అయ్యారు ఈ ఇద్దరు స్టార్స్. అందుకే వచ్చే ఏడాది ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేసేలా స్కెచ్ రెడీ చేస్తున్నారు.

విక్రమ్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన కమల్ హాసన్, సినిమాల మీద సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు. విక్రమ్ సెల్రబేషన్స్‌లోనే వరుస సినిమాలు ఎనౌన్స్ చేసిన యూనివర్సల్ స్టార్, 2024లో హ్యాట్రిక్ రిలీజ్‌లకు రెడీ అవుతున్నారు.

విక్రమ్ సక్సెస్ ఇచ్చిన జోష్‌లో ఆగిపోయిన ఇండియన్ 2 ప్రాజెక్ట్‌లో కదలిక వచ్చింది. రీసెంట్‌గా రీస్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే సినిమాలోనూ నటిస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు కమల్. ఈ రెండు సినిమాలతో పాటు మణిరత్నం దర్శకత్వంలో కమల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కూడా నెక్ట్స్ ఇయరే ప్రేక్షకుల ముందుకు రానుంది.

కమల్‌తో పాటు రజనీ కూడా నెక్ట్స్ ఇయర్ హ్యాట్రిక్ రిలీజ్‌లు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ కూతురు దర్శకత్వంలో లాల్ సలాం షూటింగ్ ఫినిష్ చేశారు. ఈ సినిమా 2024 స్టార్టింగ్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఈ నెలలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో మూవీని ఎనౌన్స్ చేశారు రజనీ. లియో తరువాత లోకేష్ తెరకెక్కించబోయే సినిమా ఇదే. లోకేష్ సినిమా అంటే మ్యాగ్జిమమ్ 100 డేస్‌లో ఫినిష్ అవుతుంది కాబట్టి ఈ సినిమా కూడా 2024లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.