4 / 6
కండలు తిరిగిన దేహం.. మెడలో దుర్గమ్మ దండ ఇలా పూర్తిగా మారిపోయాడు చైతన్య. నవంబర్ 23న చైతూ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన లుక్ విడుదల చేశారు. అంతే కాదు... తండేల్ పాత్రలో ఆయన నటిస్తున్నట్లు తెలిపారు. తండేల్ అంటే నాయకుడు, కెప్టెన్ అని అర్థం అంటున్నారు దర్శకుడు చందూ మొండేటి. ప్రతీదానికి ధైర్యంగా ముందుకు వెళ్లేవాడు.. ఎలాంటి భయం, బెరుకు లేని వాడు అని అర్థం. అలాంటి యోధుడిని తండేల్ అంటారు.. తమ సినిమాలో హీరో పాత్ర అలాగే ఉంటుంది కాబట్టి ఆ టైటిల్ పెట్టాం అంటున్నారు మేకర్స్.