బాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ శ్రద్ధా కపూర్. చిన్న వయసులోనే కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. తన ప్రతిభతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

16 ఏళ్ల వయసులోనే సల్మాన్ ఖాన్ నటించిన లక్కీ: నో టైమ్ ఫర్ లవ్ సినిమాకు ఆఫర్ వచ్చింది. కానీ అప్పటికీ నటిగా తాను సిద్ధంగా లేకపోవడంతో ఆ ఆఫర్ రిజెక్ట్ చేసిందట ఈ వయ్యారి. ఆ తర్వాత ఏడాది తీన్ పట్టి సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది.

కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలన్ని వరుసగా ప్లాప్ అయ్యాయి. కానీ హీరో ఆదిత్య రాయ్ సరసన నటించిన ఆషికీ 2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ అమ్మడు క్రేజ్ మారిపోయింది.

ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వచ్చాయి. ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాతో సౌత్ అడియన్స్ ముందుకు వచ్చింది శ్రద్ధా కపూర్. ఇటీవలే స్త్రీ 2 సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.