
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోతుంది. తెలుగులో నటిస్తూనే అటు బాలీవుడ్, ఇటు కోలీవుడ్ ఇండస్ట్రీలలోనూ అవకాశాలు అందుకుంటుంది. తెలుగులో ఎనిమిది సినిమాలు చేసింది.

మొత్తం ఎనిమిది సినిమాలు చేస్తే.. అందులో రెండు మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. కెరీర్ మొదట్లో హోమ్లీ లుక్ లో కనిపించిన ఈ చిన్నది.. ఇప్పుడు మాత్రం గ్లామర్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ సొంతం చేసుకుంది.

కానీ ఈ బ్యూటీకి తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం జిమ్ లో వర్కవుట్లతో చెమటలు చిందిస్తోంది. తాజాగా ఈ అమ్మడు జిమ్ వర్కవుట్ ఫోటోస్, వీడియోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో మీరు గుర్తుపట్టారా.. ?

తనే హీరోయిన్ రుహానీ శర్మ. చిలసౌ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల హృదయాలు దొచేసింది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా క్రేజ్ మాత్రం రాలేదు. డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు, హర్ , సైంధవ్ చిత్రాల్లో నటించింది.

ఆమె నటించిన చిత్రాల్లో చిలసౌ, హిట్ మాత్రమే విజయాన్ని అందుకున్నాయి. అయితే తెలుగులో ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో అందాలతో పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఈ అమ్మడు క్రేజీ ఫోటోస్ నెట్టింట తెగ ఆకట్టుకుంటున్నాయి.