సోషల్ మీడియాలో నాన్ స్టాప్‌గా ట్రెండ్ అవుతోంది సమంత పేరు. ఇంత సడన్‌గా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఎందుకున్నట్టు అని ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలే బయటపడ్డాయి. అందులోనూ సమంత వారందరికీ థాంక్స్ చెప్పిన విషయాన్ని ఇష్టంగా షేర్ చేస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ సామ్ థాంక్స్ ఎందుకు చెప్పినట్టు? చూసేద్దాం పదండి...
సిటాడెల్ హనీ బన్నీని పూర్తి చేయడమే నేనందుకున్న పెద్ద అవార్డు అని ఓపెన్ అయ్యారు సామ్. సిటాడెల్ షూట్‌లో ఎన్నో సార్లు స్పృహ తప్పి పడిపోయిన విషయాన్ని మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు సూపర్‌లేటివ్ లేడీ సమంత.
సిటాడెల్ సమయంలో తన సహనాన్ని తానే మెచ్చుకున్నట్టు చెప్పారు. మిమ్మల్ని మీరు మెచ్చుకోవడం కాదు మేడమ్... అవార్డులు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయని అంటున్నారు నెటిజన్లు.
ఓటీటీ అవార్డుల వేడుకలో ఉత్తమ నటిగా అవార్డు తీసుకున్నారు సామ్. నామినేషన్లలో చాలా మంది సామ్‌కి ఇష్టమైన నటీమణులున్నారట.. అయినా తనకు అవార్డు రావడం ఆనందంగా ఉందంటున్నారు సామ్.
సామ్.. నార్త్ కే పరిమితమవుతారా? ఓటీటీలకే ఫిక్సవుతారా? అంటూ రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. నిర్మాతగానూ ఓ స్టెప్ ముందుకేశారు సామ్. ఆమె ఇలాంటివి ఎన్ని చేసినా రాని హై.. జస్ట్ ఓ సినిమాకు సైన్ చేస్తే తమకు వచ్చేస్తుందన్నది ఫ్యాన్స్ ఫీలింగ్. ఇంతకీ సామ్.. ఫ్యాన్స్ మాటల్ని పట్టించుకుంటున్నట్టేనా...?