
త్వరలోనే నాగ శౌర్య పెళ్లికొడుకుగా మారనున్నాడని తెలుస్తోంది. నాగ శౌర్య పెళ్ళికి సంబంధించిన వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది.

అనూష శెట్టి అనే బెంగుళూరుకి చేసిన యువతిని నాగ శౌర్య వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పెద్దలు వీరి పెళ్ళికి అంగీకరించారు

అనూష శెట్టి ఇంటీరియర్ డిజైనింగ్ లో ప్రావీణ్యత సాధించారు. న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్స్ నుంచి ఆమె సర్టిఫికెట్ పొందారు

అంతే కాదు ఎంట్రప్రెన్యూర్ షిప్ అండ్ మార్కెటింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

బెంగుళూరులో ఆమె సొంతంగా అనూష శెట్టి డిజైన్స్ అనే సంస్థని నడుపుతున్నారు. దానికి ఆమే మ్యానేజింగ్ డైరెక్టర్. 2019ఓ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు.

2020లో దేశంలోనే టాప్ 40 బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్స్ లో ఒకరిగా నిలిచారు. ఇలా ఆమె సాధించిన ఘనతలు చాలానే ఉన్నాయి.