1 / 5
Marimuthu: ప్రముఖ తమిళ సినీ దర్శకుడు, నటుడు జి.మరిముత్తు గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. చివరగా జైలర్ సినిమాలో విలన్‌కు నమ్మకస్తుడి పాత్రలో నటించారాయన. గతేడాది విక్రమ్‌లోనూ కీలక పాత్రలో కనిపించారు. అంతేకాదు.. సూర్య కంగువా ఆయన చివరి సినిమా. ‘ఎథిర్ నీచల్’ పేరుతో ఒక టెలివిజన్ షో చేస్తున్నారు మరిముత్తు. స్టూడియోలో డబ్బింగ్ చెప్తున్న సమయంలో.. తీవ్ర గుండెపోటు రావడంతో కిందపడిపోయారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన వయసు 56 ఏళ్ళు.