
ఆ మధ్య ఏ ఇండస్ట్రీలో విన్నా కియారా పేరు వినిపించేది. ఏ పాన్ ఇండియా సినిమా మొదలైనా హీరోయిన్‌గా కియారానే ఫస్ట్ ఛాయిస్‌గా కనిపించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించటం లేదు. ప్రజెంట్ రెండు సినిమాలు మాత్రమే చేస్తున్న ఈ బ్యూటీ, ఆ తరువాత చేయాల్సిన ప్రాజెక్ట్స్ విషయంలో క్లారిటీ ఇవ్వటం లేదు. దీంతో ప్రేక్షకుల్లోనూ కొత్త డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి.

రీసెంట్‌గా ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేశారు క్రేజీ బ్యూటీ కియారా అద్వానీ. తన మూవీ పార్టనర్ సిద్దార్థ్ మల్హాత్రాను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత కూడా ఫిలిం కెరీర్‌ను అలాగే కంటిన్యూ చేస్తున్నారు. కనీసం పెళ్లి తరువాత హనీమూన్ బ్రేక్ కూడా తీసుకోకుండానే షూటింగ్‌లలో పాల్గొన్నారు కియారా.

పెళ్లి తరువాత కూడా ఫిలిం కెరీర్ కంటిన్యూ చేయటమే కాదు, గ్లామర్ విషయంలో తగ్గేదే లే అంటున్నారు ఈ బ్యూటీ. ఆఫ్టర్ మ్యారేజ్ సత్యప్రేమ్ కి కథ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ ఆ సినిమాలో గ్లామర్ యాంగిల్ కూడా గట్టిగానే చూపించారు. కానీ నెమ్మదిగా తన స్పీడుకు తానే బ్రేకులేసుకుంటురన్నారు కియారా.

ప్రజెంట్ శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ బ్యూటీ, నిన్న మొన్నటి వరకు సౌత్ నార్త్ ఇండస్ట్రీల్లో మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం అంతగా అమ్మడి పేరు వినిపించటం లేదు. కావాలనే సైడ్ అవుతున్నారో, పెళ్లి తరువాత ఇండస్ట్రీనే పక్కన పెట్టేస్తుందో తెలియదుగాని అప్ కమింగ్ సినిమాల విషయంలో కియారను పెద్దగా కన్సిడర్ చేయటం లేదు మేకర్స్.

ఈ విషయంలో కియారా ఫ్యాన్స్ కొత్త థియరీ బయటకు తీసుకువచ్చారు. పెళ్లి తరువాత ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉన్న కియారా కావాలనే సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నారన్నది నయా అప్‌డేట్. కాస్త బ్రేక్ తీసుకొని ఫ్యామిలీ లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేసిన తరువాత మళ్లీ వెండితెర మీద సత్తా చాటాలన్న ఆలోచనలో ఉన్నారట ఈ బ్యూటీ. మరి ఈ ప్లాన్ కియారా కెరీర్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.